Monday, March 26, 2018


@@మహారాష్ట్ర రైతులకు@@ #"#పాదాభివందనం"

నాకు మరింత ఉత్తేజాన్ని కల్పించిన మీ పోరాటానికి వందనం.

కాళ్ళ బొబ్బలని లెక్కచేయని మీ పాదాలకు వందనం...

తెగిన చెప్పులను లెక్కచేయని మీ "కసి" కి వందనం...
ఆకలిని లెక్కచేయని మీ ఖాళీ కడుపులకు వందనం...
కిలోమీటర్లను లెక్కచేయని మీ తెగువకు వందనం...
దారి పొడుగునా ఉక్కు క్రమశిక్షణను నేర్పిన మీ "కవాతు"కు వందనం...
హేళనగా మీ పై పోస్టులు పెడుతున్న మూర్ఖులకు కూడా "ఓపికతో" అన్నం పెట్టే మీకు వందనం...
ఎలాంటి హింస లేకుండా చూపిన మీ శాంతికి వందనం...
మిమ్మల్ని తల్లిదండ్రులుగా స్వీకరించేట్టు ముంబై పట్టణ ప్రజలకు సహాయ "గుణాన్ని" నేర్పిన మీకు వందనం...
ప్రభుత్వ గుండెలు ఆగిపోయేలా గర్జించిన మీ నినాదాలకు వందనం...
ఆత్మహత్యలపై కన్ను పెట్టని కార్పొరేట్ మీడియా సిగ్గుతో "తలదించుకునేలా" చేసిన ప్రచారానికి వందనం...
ప్రభుత్వం దిగొచ్చి డిమాండ్లు సాధించుకున్న మీ "విజయానికి" వందనం...
అన్నింటికీ మించి నాలాంటి ఈ తరానికి స్ఫూర్తిని నింపి "పోరుబాటే" భవిష్యత్ అని నిరూపించిన మీ #పాదాలకు వందనం.
....ఉడుత రవిందర్
  9490098487
Image may contain: one or more people

No comments:

Post a Comment