Friday, July 10, 2015

on Bahu Bhali Movie Releised Day

@"బహుబలి"@
@@"బలే బలి"@@
చిత్రం విడుదల కాకముందే సస్పెన్స్ తో "బలి"
సినిమా కాపీలు దొరుకక కొందరు డిస్ట్ బ్యుటర్లు "బలి"
ఇంత పెద్ద బడ్జెట్ తో సినిమాలు మేము తియగాలమా! అని టెన్షన్ తో చిన్న నిర్మాతలు "బలి"
విడుదల చేసే తేది ప్రకటించాక టికెట్స్ కోసం ప్రేక్షకులు "బలి"
'క్యూ' లో నిలబడి తొక్కిసలాటలో యువత "బలి"
బ్లాక్ లో టికెట్లు అమ్ముతుండడంతో విలువల "బలి"
వీటిని అరికట్టకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నరనే విమర్శలతో అధికారులు, ప్రభుత్వం "బలి"
టికెట్లు దొరుకక కోపంతో థియేటర్లు "బలి"
థియేటర్లు ద్వంసం అవుతాయని ఆపాలని పోయి ప్రేక్షకుల కోపానికి పోలీసులు "బలి"
ఈ వార్త కథనాలతో దినపత్రికలు, టీవీ ఛానల్స్ సమయం "బలి"
....ఇంత పెద్ద బలి తీసుకునే సినిమాలో రాజమౌళి ఎందరిని "బలి" ఇచ్చారో.....
సినిమా చూసాక ఎందరి మనోభావాలు "బలి" తీసుకుంటాడో చూడాలి....
@రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 4000 థియేటర్లలో శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా....

No comments:

Post a Comment